మీ పార్టనర్ తో జీవితాంతం గుర్తుండిపోయే ట్రిప్ వేయాలంటే బాలీ వెళ్ళచ్చు…!

-

మీ పార్ట్నర్ తో కలిసి మీరు ఏదైనా ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నారా..? జీవితాంతం అది గుర్తు ఉండిపోవాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండా మీరు బాలి వెళ్లాల్సిందే. అందమైన బీచ్లు రిసార్ట్లు తో ఎంతో అద్భుతంగా ఉంటుంది బాలి. సీ ఫుడ్ ప్రేమికులు అయితే కచ్చితంగా బాలి చూడాల్సిందే. ఎందుకంటే ఇక్కడ సీ ఫుడ్ చాలా రుచికరంగా ఉంటుంది. పార్ట్నర్ తో అయినా వెళ్లొచ్చు.

కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లొచ్చు. పైగా ఈ ప్రదేశం సంవత్సరం అంతటా కూడా ఎంతో అందంగా ఉంటుంది. అందమైన వాతావరణం ఇక్కడ ఆకర్షిస్తూ ఉంటుంది ఈ ప్రదేశానికి వెళ్లాలంటే ఏడాది పొడవునా వెళ్లొచ్చు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ నెల లో అయితే మరింత అద్భుతంగా ఈ ప్రదేశం ఉంటుంది.

పర్యాటకుల్ని ఇక్కడ బీచ్ లు ఆకట్టుకుంటాయి. సర్ఫింగ్ కూడా చేయొచ్చు. అలానే రెస్టారెంట్లు కాఫీ కేఫ్లు కూడా అందుబాటులో ఉంటాయి. అగ్నిపర్వతాల ను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పార్కులు బొటానికల్ గార్డెన్స్ కూడా ప్రకృతి ప్రేమికులను బాగా ఆకట్టుకుంటాయి.

జలపాతాలు నదులు కూడా ఎంతో ఆకర్షిస్తాయి. ట్రెకింగ్, స్కూబా డ్రైవింగ్, సర్ఫింగ్, రివర్ రాఫ్టింగ్ వంటివి ఇష్టపడే వాళ్ళు కచ్చితంగా బాలి వెళ్లాల్సిందే. పైగా ధర కూడా ఎక్కువ కాదు బడ్జెట్ ఫ్రెండ్లీ ఏ. యువతకు పార్టీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. పార్ట్నర్ తో కలిసి మీరు బాలి వెళితే అది మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది అనుమానం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news