ఏపీలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. అక్టోబరు 2వ తేదీ నుంచి నిరవదిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు. 9 ప్రధాన డిమాండ్లతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు ఉద్యోగుల సంఘం సమ్మె నోటీసు పంపించింది.
‘‘బకాయి జీతాలు చెల్లించి కార్మికుల కుటుంబాలను కాపాడాలి. పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు రూ.20వేల కనీస వేతనం చెల్లించాలి. నెలకు రూ.6 వేల చొప్పున ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి. రక్షణ పరికరాలు, ఏకరూప దుస్తులు సకాలంలో అందించాలి. ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షలు, సాధారణ మృతికి రూ.5లక్షలు అందించాలి. పంచాయతీ కార్మికులను తొలగించడం ఆపేయాలి. ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి’’ అని నోటీసుల్లో పేర్కొంది.