తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రెండ్రోజులు శ్రీవారి ఆలయం మూసివేత

-

తిరుమల శ్రీవారి ఆలయాన్ని రానున్న రెండు నెలల్లో రెండ్రోజులపాటు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. సూర్య, చంద్రగ్రహణం వల్ల గుడి మూసివేయనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 25 న సూర్యగ్రహణం సందర్భంగా ఉదయం 8:11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు స్వామి వారి ఆలయాన్ని మూసేస్తున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం ఉండటంతో ఆ రోజు కూడా ఉదయం 8:40 గంటల నుంచి రాత్రి 7:20 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసేస్తారు. గ్రహణం వీడగానే ఆలయ శుద్ధి అనంతరం గుడిని తెరవనున్నారు.

గ్రహణం కారణంగా ఈ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్, శ్రీవాణి, రూ.300 దర్శనాలు, ఆర్జిత సేవలు అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. కేవలం సర్వ దర్శనానికి మాత్రమే అనుమతిచ్చింది. భక్తులు ఈ మార్పులను గమనించాలని, ఈ సమాచారం ప్రకారం ప్రణాళికలు వేసుకుని దర్శనానికి రావాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news