అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుంది : బుగ్గన

-

వైసీపీ ప్రభుత్వం హయంలో ఆర్థిక వ్యవస్థ విద్వంసం అయ్యిందని అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుంది. గత టీడీపీ ప్రభుత్వ హయంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కంటే.. మా ప్రభుత్వంలో వృద్ధి రేటు సాధించింది అని ఏపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో 14 లక్షల కోట్లు వైసిపి ప్రభుత్వం అప్పు చేసిందని అసత్య ఆరోపణలు చేశారు. కానీ.. అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుత ఆర్థిక మంత్రి 6 లక్షల కొట్లే రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రకటించాడు. 9 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం ఉందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అంటున్నాడు.

ఇందులో ఆర్థిక మంత్రి చెబుతుంది వస్తావా..? ముఖ్య మంత్రి చెప్పింది వస్తావా.. కావాలనే మా గత వైసిపి ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సంపద సృష్టించి సూపర్ సిక్ హామీలు అమలు చేస్తామన్నారు. కానీ.. అరకొరగా దీపం పథకం ఒక్కటి అమలు చేసి మూడు అమలు చేశామని చెబుతున్నారు. ఇలాంటి అబద్దలు ముఖ్యాంత్రి చంద్రబాబు కు తగదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అసత్య ప్రచారాలను నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరు అని మాజీ మంత్రి బుగ్గన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news