ప్రజలు స్పందన కార్యక్రమంలో ఇచ్చిన వినతి పత్రాలకు రశీదు ఇవ్వాలని… ఆ సమస్యను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కూడా రశీదుపై వెల్లడించాలని సీఎం ఆదేశించారు.
ఇవాళ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి సోమవారం కలెక్టర్లు, ఎస్పీలు స్పందన కార్యక్రమం నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. ఏపీ ప్రజల సమస్యలు తొందరగా తీర్చేందుకు అధికారులు కృషి చేయాలని సీఎం జగన్ సూచించారు.
ప్రజలు స్పందన కార్యక్రమంలో ఇచ్చిన వినతి పత్రాలకు రశీదు ఇవ్వాలని… ఆ సమస్యను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కూడా రశీదుపై వెల్లడించాలని సీఎం ఆదేశించారు. ఆ వివరాలన్నింటినీ కంప్యూటరైజ్డ్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనిపై ఏమాత్రం కూడా అలసత్వం వహించొద్దని.. సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నేను కూడా స్పందన కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టా. దీనికి సంబంధించి నేను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తా. చెప్పకుండా వచ్చి చెక్ చేస్తా. అందుకే అధికారులంతా అలర్ట్ గా ఉండాలి. ప్రజా సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేందుకు అందరూ కలిసి పని చేయాలి. ఇక నుంచి ప్రతి మంగళవారం కలెక్టర్లతో, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తా.. అని సీఎం జగన్ స్పష్టం చేశారు.