సిపిఐ తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర సమితి కార్యదర్శిని బుధవారం నాడు ఎన్నుకున్నారు. రాష్ట్ర సమితి కార్యదర్శి ఎన్నిక కోసం మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావులు పోటీపడ్డారు. పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను 131 నుండి 101 కి తగ్గించారు. ఖమ్మం, హైదరాబాద్ కు చెందిన నేతలు మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా నిలిచారు. దీంతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు.
ప్రస్తుత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రెండు దఫాలుగా కొనసాగారు. ఈ దఫా చాడా వెంకటరెడ్డి స్థానంలో బాధ్యతల కోసం పల్లా వెంకట్రెడ్డి, కూనంనేని సాంబశివరావులు పోటీ పడగా.. కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహించారు. 45 నిమిషాలలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక ప్రక్రియ పూర్తయింది.