భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 3.15 గంటలకు 43.2 అడుగుల నీటిమట్టం నమోదు కావడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు 48 అడుగులకు చేరడంతో రెండో హెచ్చరికను కలెక్టర్ జారీ చేశారు.
మంగళవారం ఉదయం 7 గంటలకు 50 అడుగులుండగా సాయంత్రం 6 గంటలకు 51.6 అడుగులకు నీటిమట్టం పెరిగింది. 53కి చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ ఏడాది వరుసగా మూడు నెలల్లో నాలుగుసార్లు ప్రమాద హెచ్చరికలు జారీ కావడం భద్రాచలంలో పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
పోలవరం ప్రాజెక్టు ఎగపోటు భద్రాచలంలో గోదావరి తీరవాసులను ముప్పుతిప్పలు పెడుతోంది. నదీ పరీవాహక ప్రదేశంలో చిన్నపాటి వానొచ్చినా ఇక్కడ వరద తీవ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రవ్యాప్తంగా, ఎగువ కురుస్తోన్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో దిగువన ఉన్న భద్రాచలం వద్ద గోదావరి చిన్న వరద వచ్చిన ముంపునకు గురవుతుంది. గత వంద సంవత్సరాలుగా లేని తిప్పలు ఇప్పుడు పోలవరం రూపంలో వచ్చింది