ఏపీలో కూడా ఎస్సీ రిజర్వేషన్ అంశాలు చర్చించడానికి ఎస్సీ శాసన సభ్యలతో సీఎం చంద్రబాబు చర్చించారు. త్వరలో ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్, విధి విధానాలు, రాబోయే రోజుల్లో ఇచ్చే పోస్టుల గురించి చర్చించారు అని తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాస్ అన్నారు. ఆర్ధికాభివృద్ధి ప్రణాళిక గురించి సీఎం చర్చించారు. పేదరికం లేని సమాజం చూడాలన్న సీఎం ఆకాంక్ష. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అభివృద్ధి ని దెబ్బతీసింది. ఎస్సీలలో ఉన్న ఉపకులాల MLAలు, అనుబంధకులాలకు A,B,C చాలు.. D అవసరం లేదని MLAలు అందరం చెప్పాం అని ఆయన పేర్కొన్నారు.
ఇక మడకశిర MLA ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలలో వేసిన కమిటీలు కూడా అధ్యయనం చేసి ఎస్సీ వర్గీకరణ చేస్తారు. మాదిగ, మాదిగ ఉపకులాలు నష్ట పోకుండా నిర్ణయం తీసుకుంటారు. పెరిగిన జనాభా శాతం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వాలని కోరాం. జిల్లాల వారిగా వర్గీకరణతో పాటుగా.. రాష్ట్ర స్ధాయి వర్గీకరణ చేయాలి. అప్పుడే ఎస్సీ వర్గీకరణ సఫలం అవుతోంది అని ఆయా అన్నారు.