జడ్జిల పదవీ విరమణ వయస్సుపై బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం

-

జడ్జిల పదవీ విరమణ వయస్సుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జడ్జిల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు, సుప్రీంకోర్టు జడ్జిల పదవీ విరమణ 67 ఏళ్లకు పెంచేందుకు రాష్ట్ర బార్ కౌన్సిల్‌లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశంలో తీర్మానం చేశాయి. పదవీ విరమణ వయస్సుపై తక్షణమే రాజ్యాంగ సవరణ చేయాలని తీర్మానంలో పేర్కొన్నాయి.

వయో పరిమితి పెంపు తీర్మానానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. అనుభవజ్ఞులైన న్యాయవాదులను వివిధ కమిషన్లు, ఇతర ఫోరమ్‌లకు ఛైర్మన్‌లుగా నియమించేలా వివిధ చట్టాలను సవరించాలని కూడా బార్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసింది.

ఈ తీర్మానంపై తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. తీర్మాన కాపీని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్​ రిజిజుకు పంపాలని నిర్ణయించింది. ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు ఉండగా, సుప్రీంకోర్టు జడ్జిల పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news