త్వరలో గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు – మంత్రి హరీష్ రావు

-

త్వరలో గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫకేషన్లు విడుదల చేస్తామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. నార్సింగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు… అధికారులతో కలిసి తరగతులు పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… గురుకులాలపై ఏటా రూ. 3300 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. తెలిపారు. పిల్లల చదువుపై చేసే ఖర్చును సీఎం గారు మూలధన వ్యయంగా భావిస్తున్నారు…త్వరలో గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫకేషన్లు విడుదల చేస్తామని వెల్లడించారు మంత్రి హరీశ్ రావు. పీ హెచ్ సి వైద్యులు గురుకులాలు సందర్శించాలని.. పిల్లల ఆరోగ్య పరిస్థితి నెలవారీగా సమీక్షించాలని కోరారు.

ఇక ఇది ఇలా ఉండగా.. నిమ్స్ లో వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం అడగ్గానే సీఎం కేసీఆర్ రూ. 157 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. నిమ్స్ లో 200 పడకలతో ఎం సీ హెచ్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎం ఎన్ జే ఆసుపత్రిలో ఇటీవల అధునాతన ఆపరేషన్ థియేటర్లు ప్రారంభించామని, త్వరలో కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రి అందుబాటులోకి వస్తుంది అన్నారు మంత్రి హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news