కార్మిక శాఖ మంత్రికి చట్టం తెలియదు.. తొడలు కొట్టడం మాత్రమే తెలుసు – మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్

-

పారిశ్రామిక వాడలను అమ్మి తండ్రీ కొడుకులు వచ్చిన డబ్బులు దండుకోవచ్చని చూస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. తెలంగాణ వస్తే కార్మికుల వేతనాలు మెరుగుపడతాయన్నారని.. ఒక్క కలం పోటుతో కార్మికుల జీవితాలు మారిపోతాయని చెప్పారని.. కానీ ఇప్పటివరకు కనీసం వేతనాలు కూడా పెంచలేదని మండిపడ్డారు. ఇంతవరకు గెజిట్ కు పంపలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికుల మీద చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక శాఖ మంత్రికి చట్టం తెలియదు.. తొడలు కొట్టడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.

కనీస వేతనాలు పెంచలేదు.. కానీ నిత్యవసర సరుకులు, కూరగాయల ధరలు పెంచారని మండిపడ్డారు. సింగరేణి, ఎన్టిపిసి లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు పెంచలేదన్నారు. కార్మికులు లేకుంటే కాలేశ్వరం పని ముందుకు సాగేది కాదన్నారు రాములు నాయక్. ఎన్నో ప్రమాదాలు జరిగి చనిపోయిన వారికి నష్టపరిహారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కార్మికులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్మికులను ఆదుకోకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేసి, అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news