పార్టీ మ్యానిఫెస్టో మాకు పవిత్ర గ్రంథం. ఆ విషయాన్ని సీఎం జగన్ చెప్పారు. మా ప్రభుత్వానికి మ్యానిఫెస్టోనే ప్రధాన నియమావళి. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అందరు ప్రజలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం.. అని మంత్రి రాజేంద్రనాథ్ అన్నారు.
అమరావతి ఏపీ బడ్జెట్ 2019-20 ని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టారు. రాజకీయాల్లో విశ్వసనీయత చాలా ముఖ్యమని… ప్రజలు కోరిన పాలన కోసమే సీఎం జగన్ కృషి చేస్తున్నారని బుగ్గన అన్నారు.
పార్టీ మ్యానిఫెస్టో మాకు పవిత్ర గ్రంథం. ఆ విషయాన్ని సీఎం జగన్ చెప్పారు. మా ప్రభుత్వానికి మ్యానిఫెస్టోనే ప్రధాన నియమావళి. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అందరు ప్రజలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం.. అని మంత్రి రాజేంద్రనాథ్ అన్నారు.
ఇక.. బడ్జెట్ అంచనాను రూ. 2,27,974.99 కోట్లుగా ఆర్థిక మంత్రి వెల్లడించారు. దీంట్లో రెవెన్యూ వ్యయం రూ. 1,80,475.94 కోట్లు కాగా… మూల ధన వ్యయం రూ.32,293.39 కోట్లు.
2018-19 బడ్జెట్ తో పోల్చితే.. ఈసారి 19.32 శాతం పెరిగింది. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు సుమారు 0.17 శాతం, రెవెన్యూ లోటు రూ.1778.52 కోట్లు, ద్రవ్యలోటు దాదాపు రూ. 35,260.58 కోట్లు.
రైతు సంక్షేమం కోసం.. ధరల స్థిరీకరణ నిధికి రూ.3000 కోట్లు, ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2002 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసా పథకానికి రూ.8550 కోట్లు. రైతులకు ఉచిత విద్యుత్ కు 4525 కోట్లు.
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1140 కోట్లు.
పట్టణ స్వయం సహాయక బృందాలకు వైఎస్సార్ వడ్డీలేని రుణం కింద రూ.648 కోట్లు.
ఏపీఎస్ఆర్టీసీకి సహాయం కోసం 1000 కోట్లు. రాయితీల కోసం 500 కోట్లు. ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ కు 260 కోట్లు.
గ్రామ సచివాలయాల కోసం 700 కోట్లు. మున్సిపల్ వార్డు వాలంటీర్ల కోసం 280 కోట్లు, మున్సిపల్ వార్డు సచివాలయాలకు 180 కోట్లు.
పౌర సరఫరాలశాఖకు బియ్యం రాయితీ కింద 3000 కోట్లు, బియ్యం తదితర సరుకుల సరఫరాకు 750 కోట్లు. పౌరసరఫరాల కార్పొరేషన్ కు 384 కోట్ల రూపాయల ఆర్థిక సాయం.
బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ కు 100 కోట్లు, న్యాయవాదుల సంక్షేమ ట్రస్టుకు 100 కోట్లు, న్యాయవాదులకు ఆర్థిక సాయం కోసం 10 కోట్లు.
బీసీలకు వైఎస్ఆర్ కల్యాణ కానుక కోసం 300 కోట్లు, ఎస్సీలకు వైఎస్ఆర్ కల్యాణ కానుక కోసం 200 కోట్లు. ఎస్టీలకు వైఎస్సార్ గిరి పుత్రిక కల్యాణ కానుక
కింద 45 కోట్లు. మైనార్టీలకు వైఎస్సార్ షాదీ తోఫా కింద 100 కోట్లు.
వైఎస్సార్ గృహ పథకానికి 5 వేల కోట్లు.
అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1150 కోట్లు
కాపుల సంక్షేమానికి 2000 కోట్లు
ఆటో డ్రైవర్ల కు 400 కోట్ల ఆర్థిక సాయం
చేనేత కార్మికుల కోసం వైఎస్ఆర్ భరోసా కింద 200 కోట్లు. వైఎస్ఆర్ గ్రాంట్స్ కోసం మత సంస్థలకు 234 కోట్ల సాయం.
పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం 573.60 కోట్లు. పారిశ్రామిక మౌలిక కల్పన కోసం 250 కోట్లు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మౌలిక అభివృద్ధి వనరుల కోసం 200 కోట్లు.
జగనన్న అమ్మ ఒడి పథకం కోసం 6455.80 కోట్లు.. దానిలో, పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు 1500 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి రూ.1077 కోట్లు, వైఎస్సార్ పాఠశాలల నిర్వహణ గ్రాంటు కోసం 160 కోట్లు, అక్షయపాత్ర ఫౌండేషన్ కోసం 100 కోట్లు.
రాష్ట్ర అభివృద్ధి పథకాల అంచనా వ్యయం 92050.05 కోట్లు.. దానిలో.. ఎస్సీ సబ్ ప్లాన్ కంపోనెంట్ కింద 15,000 కోట్లు. ఎస్టీ సబ్ ప్లాన్ కంపోనెంట్ కింద 4988.52 కోట్లు. బీసీ సబ్ ప్లాన్ కంపోనెంట్ కింద 15061.64 కోట్లు.
ఆర్థిక రంగ సేవల కోసం 86,105.63 కోట్లు, దానిలో.. వ్యవసాయ అనుబంధ రంగాలకు 20,677.08 కోట్లు. గ్రామీణాభివృద్ధి కోసం 29,329.98 కోట్లు, జలవనరుల కోసం 13,139.05 కోట్లు, తాగునీరు, వరద నియంత్రణ కోసం 13,139.05 కోట్లు. విద్యుత్ శాఖకు 6861.03 కోట్లు, ఖనిజాభివృద్ధి శాఖకు 3986.05 కోట్లు.