నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా ఆదిత్య 999 ఖారారైందా? ఆ చిత్రానికి సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించనున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం పై రెండేళ్లగా కథనాలు వస్తూనే ఉన్నాయి. బాలయ్య 100 సినిమా రేసులో ఆదిత్య 999 కూడా వినిపించింది. కానీ కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి బాలయ్య సింగీతంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఫైనల్ గా స్కిప్ట్ లాక్ అయినట్లు కొద్ది సేపటి క్రితమే బాలయ్య సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. ఇటీవలే బాలయ్య సింగీతంను కలిసిన సంగతి తెలిసిందే. ఆ సమంయలో గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
ఇక నిర్మాత గా బాలయ్య పెద్దల్లుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబ కుమారుడు లోకేష్ నిర్మించనున్నారని వినిపిస్తోంది. మామ సినిమాను నిర్మించే అవకాశం తనకే ఇవ్వాలని పట్టుబడి కోరాడుట. దీంతో అల్లుడు మాట కాదనలేక మామ అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలో కూడా లేదు కాబట్టి లోకేష్ ఖాళీగా ఉంటున్నాడు. వచ్చే ఎన్నికల వరకూ ఖాళీనే. ఈ గ్యాప్ లో సినిమా నిర్మాణ రంగంలో కూడా అనుభవం సంపాదించాలని సన్నాహాలు చేస్తున్నాడు. సినిమాలంటే లోకేష్ మంచి ఇంట్రెస్ట్. బాలయ్య ప్రతీ సినిమా చూస్తానని పలు సందర్భాల్లో లోకేష్ తెలిపిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ర్టీలో తొడ కొట్టాలన్నా..చరిత్ర సృస్టించాలన్నా అది ఒక్క బాలయ్య కు మాత్రమే సాధ్యమవుతుందని చాలాసార్లు జోస్యం చెప్పాడు.
ఇప్పుడు ఆ అభిమానంతో బాలయ్య సినిమాను నిర్మించడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆదిత్య 999ని బాలయ్య అదికారిక వికీపీడియాలో కూడా అప్ డేట్ చేసారు. అయితే దర్శకుడు, నిర్మాత వివరాలు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం బాలయ్య కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. బోయపాటి, వి. వి.వినాయక్ బాలయ్య కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ నటసింహం మాత్రం ఆదిత్య 999 న్నే ముందుగా సెట్స్ కు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.