విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. దిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో భేటీ సాగింది. ఇందులో తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
ఉభయ రాష్ట్రాల మధ్య వివాదాలపైన ఈ సమావేశంలో చర్చ నడిచింది. అయితే విద్యుత్ బకాయిల అంశం చర్చకు రాలేదు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే సమావేశాన్ని ముగించారు. మరోసారి భేటీ కావాలా వద్దా అనే నిర్ణయం లేకుండానే భేటీ ముగియడం గమనార్హం.