టెట్ కష్టాలు.. పరీక్షా కేంద్రాల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోంది. అదిలాబాద్‌కు చెందిన ఒక అభ్యర్థికి ఉదయం మొదటి పేపర్ ఆదిలాబాద్‌లో, మధ్యాహ్నం రెండో పేపర్ సిద్దిపేటలో నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ పరీక్షలకు అభ్యర్థులు తమ సొంత జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించాలని ఆప్షన్ పెట్టుకుంటే.. ఆధికారులు మాత్రం వేలాది మంది అభ్యర్థులకు వేరే జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు.
ఈ నెల 20 నుండి మొదలయ్యే టెట్ పరీక్షలు కేవలం 9 జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం వల్ల అభ్యర్థులకు ఈ కష్టాలు మొదలు అయ్యాయి. ఇప్పటికే రూ. 400 ఉన్న టెట్ పరీక్ష రుసుమును పేపరుకు రూ. 1,000 చేయడంపై విమర్శల వెల్లువ వస్తోంది. ప్రభుత్వ టీచర్ ఉద్యోగ ఆశావహులు (2.38 లక్షలు) కాకుండా, పదోన్నతుల కోసం 48 వేల మంది ఉపాధ్యాయులు కూడా ఈసారి టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.