నోరా ఫతేహి ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే!

-

బాలీవుడ్ అందాల బ్యూటీ నోరా ఫ‌తేహి.. ఈ పేరుకు నార్త్​లోనే కాదు ఇటు సౌత్​లోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు.కెనడాకు చెందిన ఈ హాట్ బాంబ్‌ కంటి చూపుతో కుర్రాళ్ల‌ని అలా క‌ట్టిప‌డేస్తుంది. ఈ మల్టీటాలెంటెడ్​ భామ.. మోడ‌ల్​గా కెరీర్​ను స్టార్ట్ చేసి.. స్పెషల్​ సాంగ్స్​ డ్యాన్సర్​ సింగర్​, నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది.

మోడ్రన్​ డ్రెసుల్లో ఫొటోలకు పోజులిస్తూ వాటిని సోషల్​మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఇప్పుడు కూడా ఓ ఫ్యాషన్​ డ్రెస్​లో కనిపించి ఫ్యాన్స్​ను ఆకట్టుకుంది. అయితే దాని ధర ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది. అదెంతో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.
ఈ ఎల్లో కలర్​ డ్రెస్​.. డిజైనర్​ రొబెర్టో క్యావల్లి ఎస్​ఎస్​22 కలెక్షన్​కు సంబంధించినది. దీన్ని ధర రూ.3 లక్షల 77, 169.దీంతో పాటే మరో అదిరిపోయే ట్రెండీ డ్రెస్​లోనూ కనువిందు చేసింది.అదిరిపోయే ఇయర్​ రింగ్స్​, మినీ హ్యాండ్​ బ్యాగ్​ స్పెషల్​ యాట్రాక్షన్​గా నిలిచింది.

హాట్ బ్యూటీ నోరా ఫతేహి డ్యాన్సర్‌, మోడల్‌, సింగర్‌​, నటి, రియలిటీ షోకు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకుంది. టాలీవుడ్‌లో టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది. తనకు ఇన్​స్టాగ్రామ్​లో 42 మిలియన్ల మంది ఫాలోవర్స్​ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news