BREAKING : సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్

-

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ పేరును ప్రస్తుతం న్యాయమూర్తి జస్టిస్ UU లలిత్ ప్రతిపాదించారు. దీంతో జస్టిస్ డివై చంద్రచూడ్ 50వ సిజెఐ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ UU లలిత్ ఈ ఏడాది నవంబర్ 8న రిటైర్ కానున్నారు. గతంలో ఏడేళ్ల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా కొనసాగిన జస్టిస్ వై.చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వై.వీ. చంద్రచూడ్.

16 వ సీజేఐగా 1978 ఫిబ్రవరి 2 నుంచి 1985 జూలై 11 వరకు కొనసాగారు జస్టిస్ వై.వి. చంద్రచూడ్. అలాగే, బొంబాయి ఉన్నత న్యాయస్థానం ధర్మాసనముకు 29 మార్చి, 2000 న న్యాయమూర్తిగా నియమింపబడ్డారు. మహారాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ గా పని చేశారు. అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా, 31 అక్టోబర్, 2013 నాడు ప్రమాణ స్వీకారం చేశారు. భారత సర్వోన్నత న్యాయస్థానము న్యాయమూర్తిగా, 13 మే 2016 పదోన్నతి పొందారు.

Read more RELATED
Recommended to you

Latest news