మరో వైసీపీ నేత దారుణ హత్య..కత్తులతో దాడి చేసి మరీ

-

ఏపీలో కలకలం రేగింది. మరో వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని మైసూర్ వారి పల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ వైఎస్సార్ సీపీ నాయకుడు దివిటి రామ్మోహన్(50) దారుణ హత్యకు గురయ్యారు.

శనివారం స్వగ్రామమైన శాంతినగర్ లోని ఆయన ఇంటి వద్ద బయట వరండాలో కూర్చొని ఉండగా, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మాస్కులు ధరించి కత్తులతో నరికారు. రామ్మోహన్ భార్య విజయలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వచ్చేలోపే వారు ద్విచక్ర వాహనంపై పరార్ అయ్యారు.

శాంతినగర్ లో విజయలక్ష్మి అంగన్ వాడి టీచర్ గా పని చేస్తుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news