పీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త.. రూ.81,000.. ఇలా చెక్ చేసుకోండి..!

-

ఈ నెల చివరికల్లా 7 కోట్ల మంది చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కి చెందిన ఖాతాదారులకు వడ్డీని ప్రభుత్వం వారి అకౌంట్ లో బదిలీ చేయబోతోంది. 8.1 శాతం వడ్డీ వస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు పీఎఫ్ ఖాతాలో వచ్చిన వడ్డీని కౌంట్ చేసారు.

త్వరలో ఇది ఖాతాదారుల ఖాతాకు బదిలీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది వడ్డీ 40 ఏళ్ల కనిష్ఠ స్థాయిలో ఉంది. ఖాతాలో రూ. 10 లక్షలు ఉంటే మీకు రూ. 81,000 వడ్డీ లభిస్తుంది వస్తుంది. అదే ఒకవేళ రూ.7 లక్షలు ఉంటే రూ.56,700 లభిస్తుంది. ఒకవేళ రూ.5 లక్షలు ఉంటే రూ.40,500 వడ్డీ వస్తుంది. లక్ష రూపాయలు ఉంటే 8,100 రూపాయలు పొందచ్చట.

వడ్డీని ఎలా చెక్ చెయ్యాలి..?

epfindia వెబ్సైట్ కి లాగిన్ చేసి, ‘అవర్ సర్వీసెస్’ డ్రాప్‌డౌన్ మెను క్రింద ఉన్న ‘ఉద్యోగుల కోసం’ పై క్లిక్ చేయాలి.
నెక్స్ట్ ఆపై, ‘సర్వీసెస్’ కింద ‘సభ్యుని పాస్‌బుక్’ ని సెలెక్ట్ చెయ్యండి.
మీ UAN నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చెయ్యాలి.
యాక్టివేట్ చేయబడిన యూఏఎన్(UAN) నంబర్ ఉంటేనే అవుతుంది. లేదంటే అవ్వదు.
మీకు UAN లేకపోతే, అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేసి epfoservices.in/epfo/ మీ ఆఫీస్ లింక్‌పై క్లిక్ చేసే ముందు మీ స్థితిని ఎంచుకోండి.
ఖాతా నంబర్, పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి PF బ్యాలెన్స్‌ని చూడచ్చు.

“EPFOHO UAN ENG” అనే టెక్స్ట్‌ను 7738299899కి SMS పంపండి. ‘ENG’ ఇక్కడ మీ ప్రాధాన్యత గల భాషలోని మొదటి మూడు అక్షరాలను సూచిస్తుంది. కనుక భాష బట్టి టైప్ చెయ్యండి. తెలుగులో SMS పొందాలనుకుంటే ‘TEL’ అని టైప్ చెయ్యండి. ఇలా ఎస్సెమ్మెస్ ద్వారా తెలుసుకోవచ్చు.

లేదా EPFO సభ్యులు 011-22901406 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వారి PF బ్యాలెన్స్‌ని చెక్ చేయవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news