30 కోట్లు విలువ చేసే పాము విషం స్వాధీనం

-

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో అటవీ అధికారులు ఫ్రాన్స్ నుంచి చైనాకు అక్రమంగా తరలిస్తున్న రెండున్నర కేజీల పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని విలువ రూ. 30 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు అధికారులు. పాము విషాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఫన్సిడేవా ప్రాంతంలో సోదాలు నిర్వహించారు అటవీ అధికారులు. దీంతో.. శనివారం రాత్రి రెండున్నర కేజీల పాము విషాన్ని గుర్తించారు అధికారులు. ఓ క్రిస్టల్ జార్‌లో నింపి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లాకు చెందిన మహ్మద్ సరాఫత్‌గా గుర్తించారు అధికారులు.

Made From Snake Venom, These Hydrogels Could Treat Uncontrolled Bleeding |  Smart News| Smithsonian Magazine

పాము విషాన్ని చైనాకు తరలిస్తున్నట్టు విచారణలో అతడు పేర్కొన్నాడు అధికారులు. విషం బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి వచ్చిందని, ఇక్కడి నుంచి దానిని నేపాల్‌కు తరలించి అక్కడి నుంచి చైనాకు తీసుకెళ్లనున్నట్టు చెప్పాడు. అంతర్జాతీయ మార్కెట్లో పాము విషానికి విపరీతమైన డిమాండ్ ఉందని, పట్టుబడిన పాము విషం రూ. 30 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో పాము విషాన్ని స్వాధీనం చేసుకోవడం 35 రోజుల్లో ఇది రెండోసారి. సెప్టెంబరు 10న జల్పాయ్‌గురి జిల్లాలో రూ. 13 కోట్ల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news