సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.
దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ ని పాన్ నెంబర్ ని అప్డేట్ చేసుకోమని అంటోందట. పైగా కస్టమర్స్ కనుక పాన్ నెంబర్ ని అప్డేట్ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోతుందని అందులో ఉంది. అయితే నిజంగా పాన్ నెంబర్ ని అప్డేట్ చేయకపోతే ఖాతా బ్లాక్ అయిపోతుందా ఇందులో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.
A #Fake message issued in the name of SBI is asking customers to update their PAN number to avoid their account from getting blocked#PIBFactCheck
▶️Never respond to emails/SMS asking to share your personal or banking details
▶️Report at👇
📞1930 pic.twitter.com/6xUBaWaOtm
— PIB Fact Check (@PIBFactCheck) October 17, 2022
తాజాగా వచ్చిన ఈ వార్త లో ఏ మాత్రం నిజం లేదు. దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ ని పాన్ నెంబర్ ని అప్డేట్ చేసుకోమని వచ్సిన వార్త నకిలీ వార్త మాత్రమే. పాన్ నెంబర్ ని అప్డేట్ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవ్వదు. కనుక ఇలాంటి నకిలీ వార్తలకి దూరంగా ఉంటే మంచిది.