Centre Hikes MSP: దీపావళికి ముందే అన్నదాతలకు శుభవార్త..!

-

కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. దీనితో రైతులకి బెనిఫిట్ కలగనుంది. ఇక పూర్తి వివరాలను చూస్తే.. కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీని మూలంగా ఎందరో రైతులకు లబ్ధి చేకూరనుంది. రబీ పంటల కనీస మద్దతు ధరను కేంద్రం పెంచుతున్నట్టు చెప్పింది.

farmers

ఈ నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ మంగళవారం నాడు ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ మీడియాకు పంటల ధర పెంచినట్టు చెప్పారు. రబీ పంటల కనీస మద్దతు ధరలు పెంచగా.. గోధుమలు, బార్లీ, ఆవాలు, కుసుమ పువ్వు, పప్పులు ఇవన్నీ కూడా ఉన్నాయిట.

ఇక వాటి వివరాలను చూస్తే.. గోధుమ పంటకు రూ.110 మేర పెంచారు. అలానే బార్లీ పంటపై రూ.100 మేర, శనగ పంటకు రూ.105, పప్పులకు రూ.500 చొప్పున పెంచింది కేంద్రం. అలానే ఆవాలు పంట పై రూ.400, కుసుమ పువ్వు పంటకు రూ.209 చొప్పున పెంచారు.

ఈ ధరలు పెరగడంతో గోధుమ పంట రూ.2125 అయ్యింది. బార్లీ రూ.1735 , శనగ క్వింటాల్‌కు రూ.5335 వచ్చింది. పప్పుధాన్యాలపై క్వింటాల్‌కు రూ.6000, ఆవాలు పంట పై రూ.5450, కుసుమ పువ్వు రూ.5650 అయ్యింది. అయితే ఇది దీపావళికి ముందు కావడంలో రైతులకు చక్కటి ప్రయోజనం కలగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news