ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2119 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,38,636 కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 10 మందికి కరోనాతో మరణించగా, మొత్తం సంఖ్య 5,28,953 కు చేరిందని ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 25,037 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 87.9 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2582 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,40,84,646 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.19 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక నిన్న ఒక్క రోజే 4,63,338 మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేశారు.
#COVID19 | India reports 2,119 fresh cases and 2,582 recoveries in the last 24 hours.
Active cases 25,037
Daily positivity rate 1.13%— ANI (@ANI) October 21, 2022