చాలా మంది రైతులు పీఎం కిసాన్ స్కిం ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రం ఈ స్కీమ్ ని అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా రైతులకి రూ.6000 చొప్పున అందుతోంది. మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతుల అకౌంట్ లో అందుతోంది.
అక్టోబర్ 17 సోమవారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద డబ్బులు అందాయి. ఏడాదికి మూడు సార్లు రూ.2000 చొప్పున రైతుల అకౌంట్ లోకి వస్తాయి. ఇదిలా ఉంటే కేంద్రం ఇప్పటి వరకు రూ.2 లక్షల కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది.
అయితే కొంత మందికి మాత్రం డబ్బులు అందలేదు. ఈ-కేవైసీ పూర్తి చెయ్యకపోతే డబ్బులు అందవు. చాలా మంది అన్నదాతలు ఈ-కేవైసీ పూర్తి చేయకపోవడంతో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అందలేదు. 2.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 2000 రూపాయల పడలేదు.
12 కోట్ల మందికి పైగా రైతుల రిజిస్ట్రేషన్ ఉండగా..ఎనిమిది కోట్ల మంది రైతులకే డబ్బులు వచ్చాయట. నాలుగు కోట్ల మంది రైతులకు ఈసారి డబ్బులు అందలేదట. కనుక రైతులు వివరాలను జాగ్రత్తగా చూసుకోవడం.. ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం వంటివి అవసరం.