ఇవాళ తెలంగాణలోకి రాహుల్ జోడో యాత్ర ఎంటర్ కానుంది. రాయచూర్ యర్మరస్ నుండి మహబూబ్ నగర్ జిల్లా థాయ్ రోడ్ సర్కిల్ వరకు రాహుల్ యాత్ర కొనసాగనుంది. దాదాపు 13 కిలోమీటర్ల మేర సాగనుంది ఈ యాత్ర. ఈ నేపథ్యంలోనే… కృష్ణ నది బ్రిడ్జి మీద రాహుల్ గాంధీ కి స్వాగతం పలకనున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.
భారత్ జోడో యాత్ర తెలంగాణ లోకి ప్రవేశించినప్పుడు రాహుల్ గాంధీ కి జాతీయ పతాకాన్ని అందించనున్నారు Tకాంగ్ నేతలు. కృష్ణా నదిబ్రిడ్జినుండి తెలంగాణ లో మూడు కిలోమీటర్ల మేర సాగనుంది రాహుల్ యాత్ర. ఇక ఇవాళ మరిక్కల్ వద్ద ప్రసంగించాక ఢిల్లీ కి రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. మక్తల్ నుండి హైదరాబాద్ కి హెలికాప్టర్ లో ప్రయాణం చేసి.. అక్కడ నుండి ఢిల్లీకి రాహుల్ పయనం కానున్నారు. దీపావళి పండుగ కోసం మూడు రోజులు జోడో యాత్రకు బ్రేక్ ఇచ్చారు రాహుల్. ఈ నెల 27 ఉదయం 6 గంటల నుండి మళ్లీ మక్తల్ నుండి జోడో యాత్ర ఆరంభం కానుంది. నవంబర్ 8 వరకు తెలంగాణలో జోడో యాత్ర కొనసాగనుంది.