స్ఫూర్తి: సేంద్రియ వ్యవసాయమే చేస్తున్న రైతు కుటుంబం…చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

-

ఈ మధ్యకాలంలో కెమికల్స్ తో పండించే పంటలు ఎక్కువైపోతున్నాయి. దీని వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. నిజానికి సేంద్రియ వ్యవసాయం వలన చక్కటి ప్రయోజనం పొందవచ్చు. పురుగుల మందులను ఉపయోగించి పండించే కూరగాయలు ఆకుకూరలు వల్ల ఎంతో నష్టం ఉంటుంది.

వీటి వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అందుకని ప్రతి ఒక్కరూ కెమికల్స్ లేకుండా ఉండే పంటలను పండించడం మంచిది అయితే నిజానికి ఇటువంటి పంటల వల్ల అనారోగ్యం వస్తుందని ముందుగానే గమనించి ఒక రైతు ఎనిమిదేళ్ల నుండి సేంద్రియ పద్ధతుల్లో మాత్రమే ఆకు కోరాలని పండిస్తున్నారు మరి ఇంక రైతు వివరాలను చూస్తే….

వరంగల్ కి చెందిన పూర్ణ చందర్ అనే ఒక వ్యక్తి గత ఎనిమిది ఏళ్ల నుండి సేంద్రియ వ్యవసాయం మాత్రమే చేస్తున్నారు సేంద్రియ వ్యవసాయం లో పాలకూర, తోటకూర, గోంగూర మొదలైన ఆకుకూరల్ని పండిస్తున్నారు. ఏడాది పొడుగునా ఆకుకూరల కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అందులోనూ ఎటువంటి కెమికల్స్ ని ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతుల్లో మాత్రమే పండించడంతో డిమాండ్ మరింత ఎక్కువ ఉంటుంది. చక్కగా ముందే గ్రహించి ఆకుకూరలను సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్నారు పూర్ణచందర్.

వరంగల్ తో పాటుగా నర్సంపేట జనగామ మొదలైన ప్రాంతాలకు వీటిని సప్లై చేస్తున్నారు. ఏడాదిలో నెలకు ఓసారి చొప్పున చేతికొస్తుంది. విత్తనం నాటిన నెలరోజులకు పంట వస్తుందట అయితే పంట త్వరగా చేతికి రావడంతో వ్యయం తగ్గి లాభాలు వస్తాయని రైతులు అంటున్నారు. ఎరువుల వాడకం లేకుండా ఇలా సాగు చేయడం ఎంతో గొప్ప విషయం చాలా మంది రైతులు ఇతన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళితే మంచిది. నిజానికి ఈ రైతును చూస్తే ఎవరైనా ఫిదా అయిపోతారు ఇలాంటి పంటల వల్ల ఎటువంటి నష్టం కలగదు. పైగా కెమికల్స్ ఉండవు కాబట్టి ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు.

Read more RELATED
Recommended to you

Latest news