BREAKING : భోపాల్​లో గ్యాస్ లీక్.. ఇళ్ల నుంచి జనం పరుగులు

-

గ్యాస్ లీకేజీ ఘటనతో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ మరోసారి ఉలిక్కిపడింది. ఓ వాటర్ ఫిల్టర్ ప్లాంటులోని సిలిండర్ నుంచి క్లోరిన్ లీకై ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన 1984 నాటి దుర్ఘటనను తలపించడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు.

“షాజహనాబాద్​లోని ఈద్గా హిల్స్ ప్రాంతంలో ఉన్న భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ ప్లాంట్​లో బుధవారం 900 కేజీల క్లోరిన్ సిలిండర్ లీకైంది. ప్లాంట్ పరిసరాల్లోని మురికివాడల్లో నివసిస్తున్న ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించాం. బాధితులకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. బాధితులు వాంతులు చేసుకున్నట్లు కొందరు స్థానికులు చెప్పారు. గ్యాస్ లీకేజీ గురించి తెలియగానే.. ప్లాట్​లో ఉన్న సిబ్బంది సిలిండర్​ను నీటిలో పడేశారు. లీకేజీని అడ్డుకొని, సిలిండర్​కు మరమ్మతులు చేశారు.”
-ఉమేశ్ మిశ్రా, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్

Read more RELATED
Recommended to you

Latest news