ఇండియాను దెబ్బతీయడానికి పాకిస్థాన్ రకరకాల కుట్రలు పన్నుతోంది. ఇండియాకు వ్యతిరేకంగా సైబర్ ఆర్మీని తయారు చేసేందుకు పాకిస్థాన్‌కు తుర్కియే (టర్కీ) రహస్యంగా సాయం చేసింది. ఈ విషయాన్ని నార్డిక్ మానిటర్ అనే ఐరోపా పత్రిక పేర్కొంది. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాటానికి అవసరమైన ఒప్పందం ముసుగులో ఈ సాయం అందించినట్లు వెల్లడించింది.
దక్షిణాసియాలోని మైనార్టీల అభిప్రాయాలు, ఆలోచనలను ప్రభావితం చేసి భారత్, అమెరికాపై ప్రతికూల ప్రభావం చూపేలా చేయడం ఈ ఆర్మీ ప్రధాన కర్తవ్యం. పాకిస్థాన్ పాలకులపై వచ్చే విమర్శలను అణచివేసేందుకు ఈ ఆర్మీని ఏర్పాటు చేశారు. 2018లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హయాంలోనే తుర్కియే ఇంటీరియర్ మంత్రి సులేమాన్ పాక్ పర్యటించినప్పుడు ఈ ప్లాన్‌కు ఆమోద ముద్ర పడింది. దీనికి సైబర్ క్రైమ్‌కు వ్యతిరేకంగా ఇరుదేశాల మధ్య సహకారానికి చేసుకొన్న ఒడంబడికకు ద్వైపాక్షిక ఒప్పందం ముసుగు వేసినట్లు నార్డిక్ మానిటర్ పేర్కొంది.