ఎమ్మెల్యే రాజాసింగ్ పిడి యాక్ట్ పిటిషన్ పై హైకోర్టు విచారణ

-

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పీడి యాక్ట్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. తనపై అక్రమంగా పీడీ యాక్ట్ ను ఫైల్ చేశారని పేర్కొంటూ రాజాసింగ్ హైకోర్టులో కేసును దాఖలు చేశారు. మరోవైపు పీడీ యాక్ట్ పై కౌంటర్ దాఖలు చేసింది ప్రభుత్వం. తదుపరి విచారణని సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది హైకోర్టు.

రాజాసింగ్ పై పీడియాక్ట్ అమలుకు అడ్వైజరీ బోర్డు ఆమోదం తెలిపింది. పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ ను సమర్ధిస్తూ తీర్పు వెల్లడించింది. పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలని రాజాసింగ్ భార్య ఉషాబాయ్ చేసిన రీవోక్ పిటిషన్ ని రిజెక్ట్ చేసింది. సుప్రీంకోర్టు ప్రొసీజర్ ప్రకారమే చర్యలు తీసుకున్నారని గుర్తించింది. నిబంధనల ప్రకారమే ఏడాదికాలం పీడీ యాక్ట్ అమలు చేయాలని ఆదేశించింది. ఇక బోర్డు ఇచ్చిన తీర్పుపై రాజా సింగ్ తరపు న్యాయవాది కరుణ సాగర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బోర్డు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్తామనిి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news