కరోనా ఎఫెక్ట్.. కంచెలు దూకి పారిపోయిన ఉద్యోగులు..!

-

చైనాలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. అక్కడి ప్రజలకు కరోనా భయం కంటే దాని వ్యాప్తికి అమలు చేస్తున్న ఆంక్షల వల్లే భయం కలుగుతోంది. చైనాలో కొవిడ్ జీరో పాలసీ ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. లాక్‌డౌన్ పేరు వింటేనే చైనీయులు వణికిపోతున్నారు. తాజాగా కరోనా ఆంక్షలు తప్పించుకునేందుకు జెంగ్‌ఝౌలోని అతిపెద్ద ఫ్యాక్టరీ నుంచి సిబ్బంది ఫెన్సింగ్ దూకి బయటకు వెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ‘జెంగ్‌ఝౌ నగరంలో అతిపెద్ద ఐఫోన్‌ ఫ్యాక్టరీ నుంచి కార్మికులు కంచెలు దూకుతున్నారు. అక్కడి నుంచి దొంగచాటుగా బయటపడి, పారిపోతున్నారు’ అంటూ ఓ నెటిజన్‌ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.

హెనాన్‌ జెంగ్‌ఝౌలో ఉన్న ఫాక్స్‌కాన్‌ ప్లాంట్ లో యాపిల్ ఉత్పత్తులు అసెంబుల్‌ చేస్తారు. అందులో తాజాగా విడుదలైన ఐఫోన్‌ 14 పరికరాలు కూడా ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలో కొవిడ్ కేసులు వెలుగు చూడడంతో పలువురు సిబ్బందిని ఫాక్స్‌కాన్ సంస్థ క్వారంటైన్‌లో ఉంచిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నుంచి ఉద్యోగులు కంచెలు దూకిన దృశ్యాలు బయటకువచ్చాయి. ఈ వీడియోలు వెలుగులోకి రావడంతో ఇంటికి వెళ్లాలనుకునే ఉద్యోగుల కోసం సంస్థ, ప్రభుత్వ యంత్రాంగం వాహనాలను ఏర్పాటు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news