మునుగోడు ఉపఎన్నిక తేదీ దగ్గర పడుతున్న సమయంలో నల్గొండలో ఐటీ దాడులు కలకలం రేపాయి. పట్టణంలోని తిరుమలనగర్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి నివాసంలో సోమవారం రాత్రి ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ నేతృత్వంలో చేసిన ఈ తనిఖీల్లో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సోదాలు చేస్తున్న సమయంలో స్థానిక పోలీసులతో పాటు మీడియాను ఇంట్లోకి రానివ్వలేదు.
సాయంత్ర 6 గంటల నుంచి దాదాపు రాత్రి 10.30 సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో ఇంటి బయట ఉన్న ప్రభాకర్‌రెడ్డిని, ఆయన మిత్రులను పిలిచి విచారించారు. దాడులు పూర్తయిన అనంతరం వివరాలు వెల్లడించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రభాకర్‌రెడ్డి ఇంటి నుంచి సీజ్ చేసిన ఓ బ్రీఫ్‌కేసును తీసుకెళ్తున్నట్లు మీడియా కంటపడింది. తెలంగాణ ఆదాయపు పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.