హీరోయిన్ హన్సిక పెళ్లి తేదీ ఇదే..వరుడు ఎవరంటే..!!

-

టాలీవుడ్లో దేశముదురు సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ హన్సిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమా తర్వాత ఊహించని స్థాయిలో క్రేజ్ సంపాదించింది. ఇక కోలీవుడ్ లో కూడా తనదైన స్టైల్ లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా హన్సిక పెళ్లికి సంబంధించి కొన్ని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వార్తలకు సంబంధించి పూర్తిస్థాయిలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. హన్సిక డేటింగ్ లో ఉన్న ఆ వ్యక్తి పేరు సాహల్ కూతురియా ఈయన ఒక ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరిని సమాచారం.

హన్సిక డిసెంబర్ 4వ తేదీన తన వివాహం చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ మీడియా నుంచి సమాచారం అందుతోంది. ఇక సమాచారం ప్రకారం పెళ్ళికి రెండు రోజుల ముందు నుంచి సంగీతం,మెహంది కార్యక్రమాలు కూడా జరగబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి పలు పనులు కూడా ఇప్పటికే మొదలవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హన్సిక వివాహం గురించి అభిమానులు కాస్త ఆనందపడుతున్నారని చెప్పవచ్చు. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ 31 సంవత్సరాలకు వివాహం చేసుకోవడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అయితే కోలీవుడ్లో అందుతున్న సమాచారం ప్రకారం రాజస్థాన్లోని జైపూర్లో ముండోటా ప్యాలెస్ లో హన్సిక వివాహం జరగబోతున్నట్లు సమాచారం.సోహాల్ కంపెనీలో హన్సికకు కూడా షేర్స్ ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ పెళ్లి కోసం ఇప్పటికీ పలు గదులు కూడా బుక్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. హన్సిక వివాహం తర్వాత సినిమాలలో నటిస్తుందో లేదో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం హాన్సిక ఒక్కో చిత్రానికి రూ.2 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటోంది. మరి హన్సిక రాబోయే రోజుల్లో నిర్మాతగా కూడా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి హన్సిక తన వివాహంపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news