మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఉపఎన్నికలో నియోజకవర్గ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇవాళ తమ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో మునుగోడు ప్రజలు 47 మంది అభ్యర్థుల భవిష్యత్‌ను నిర్ణయించనున్నారు.
నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్దకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వచ్చారు. ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించడానికి వచ్చానని తెలిపారు. అలాగే పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చుశానని.. పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. మునుగోడు ప్రజలు తెలివిమంతులని.. వారికి ఏం కావాలో.. ఎవరైతే వారికి సరైన న్యాయం చేయగలరో..వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలరో వారికి బాగా తెలుసుని అన్నారు. నియోజకవర్గ ఓటర్లు ఇవాళ తమ ఓటుతో సరైన నిర్ణయమే తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంతా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరారు.