మహేష్ బాబు హోటల్స్ పేర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన ప్రతి సినిమాతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మహేష్ బాబు మరి ఆ డబ్బంతా ఏం చేస్తున్నాడు? ఎక్కడ దాస్తున్నాడు? ఎవరికైనా ఇస్తున్నాడా? అనే విషయం ప్రస్తుతం పెద్ద ఆసక్తిగా మారింది . నిజానికి సినిమాల ద్వారా వచ్చిన డబ్బును ఆయన దాచుకోవడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. చాలావరకు పెట్టుబడిగానే ఆ డబ్బులను ఉపయోగిస్తాడు. ఇప్పటికి చాలా రకాల వ్యాపారాలు కూడా ప్రారంభించాడు. మహేష్ బాబు ఇప్పుడు వీటికి అదనంగా హోటల్ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నాడు.

మునుపటిలాగే తనకు బాగా కలిసొచ్చిన ఏషియన్ గ్రూప్ తో కలిసి హోటల్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నాడు మహేష్ బాబు. మొదటి విడతగా హైదరాబాదులోని రెండు ప్రాంతాలలో రెండు ఖరీదైన రెస్టారెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఒక రెస్టారెంట్ కు” మినర్వా ఏ ఎన్”.. ఏ ఎన్ అంటే ఏషియన్ నమ్రత… మరో రెస్టారెంట్ కు “పాలస్ హైట్స్” అనే పేర్లు పెట్టారు.. ప్రస్తుతం ఈ రెండు రెస్టారెంట్లకు సంబంధించి ఇంటీరియర్ వర్క్ జోరుగా సాగుతోంది. డిసెంబర్లో ఈ రెండు రెస్టారెంట్లను ఒకేసారి ప్రారంభించబోతున్నారు. మహేష్ బాబు పూర్తిగా హై క్లాస్ ను దృష్టిలో పెట్టుకొని ఈ రెస్టారెంట్స్ ను నిర్మిస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు ఈ రెస్టారెంట్లకు మూడింతల పార్కింగ్ ప్లేస్ కూడా కేటాయిస్తున్నారట. ఇప్పటికే మహేష్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అయ్యాడు. అలాగే రెడీమేడ్ క్లాత్ బ్రాండ్ కూడా ఉంది. అటు రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులు పెడుతున్నాడు. ప్రస్తుతం నిర్మాణ సంస్థ కూడా ఉందనే విషయం తెలిసిందే. ఇప్పుడు హోటల్ బిజినెస్ కూడా మొదలు పెడుతున్నారు. మొత్తానికైతే తన సంపదను పెంచుకునే పనిలో ఉన్నారు మహేష్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news