హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ప్రచారకార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బిలాస్‌పూర్ నియోజకవర్గపరిధిలో పర్యటిస్తుండగా.. ఓ ఇరుకు రోడ్డులో బస్సు బ్రేక్‌డౌన్ అయ్యింది. దీంతో బస్సు ఆగిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కేంద్రమంత్రి కాన్వాయ్ కూడా ముందుకు కదిలే పరిస్థితిలేదు.
విషయం తెలుసుకున్న ఆయన కారు దిగి అక్కడున్న వారితో కలిసి బస్సును ముందుకు తోశారు. అనంతరం బస్సు డ్రైవర్, ప్రయాణికులతో కాసేపు మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ట్రాఫిక్ సర్దుకున్నాక అక్కడి నుంచి ప్రచారానికి వెళ్లిపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేస్తామని అనురాగ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. అన్ని యాత్రాస్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. . ‘ప్రాజెక్ట్ శక్తి’ పేరిట రానునున్న 10 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేస్తామని అన్నారు.
On his way to address an election meeting in Bilaspur, I&B Minister @ianuragthakur found himself stuck in a traffic jam caused by a bus that had stalled. He got off his car, pushed the bus to help the driver get the engine going, left for next meeting.#HimachalPradeshElections pic.twitter.com/78wAZAUYZc
— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) November 8, 2022