పిజ్జాలో ఇలా ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా గమనించారా..?

-

మనం రోజూ చూసేవే అయిన కూడా వాటి గురించి చాలా మందికి తెలియదు..వాటిని ఎందుకు వాడతారో చాలామందికి తెలియదు.ఎందుకు అని ప్రశ్నలు ఎదురైతే సమాధానం మాత్రం ఉండదు..అలాంటి వాటిలో ఒకటి పిజ్జాలో వచ్చే ప్లాస్టిక్ టేబుల్. మనలో చాలా మంది పిజ్జాలను అమితంగా ఇష్టపడుతారు. నిత్యం వేడి వేడి పిజ్జాలను లాగించేస్తారు. అయితే, పిజ్జా ఆర్డర్ బాక్సులో చిన్న ప్లాస్టిక్ టేబుల్ కనిపిస్తుంటుంది. అది ఎందుకు పెట్టారో తెలియదు.

ఈ చిన్న పిజ్జా టేబుల్ ను పిల్లలు ఆడుకోవడానికి ఇస్తారని చాలా మంది భావిస్తారు. మరికొంత మంది పిజ్జా తిన్న తర్వాత టూత్ పిక్ లా ఉపయోగపడుతుందనుకుంటారు. అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. పిజ్జాలో ఉండే ప్లాస్టిక్ టూల్ అనేది డెలివరీ సమయంలో అటు ఇటు కదిలి చెడిపోకుండా కాపాడుతుంది. వాస్తవానికి పిజ్జా అనేది కార్టన్ బాక్సుల్లో డెలివరీ చేస్తారు. అయితే, పిజ్జా వేడిగా ఉండటం మూలంగా కార్టన్ బాక్స్ మెత్తబడి, పిజ్జా అట్ట పెట్టెలకు అతుక్కుని చెడిపోయే అవకాశం ఉంటుంది.

ఆ ప్రమాదం నుంచి ఈ పిజ్జా టేబుల్ కాపాడుతూ ఉంటుంది..పిజ్జాలు వచ్చిన మొదట్లో టూల్ అనేది ఉండేది కాదు. అయితే, పలు మార్లు పిజ్జా డెలివరీ తీసుకున్న వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పిజ్జా కంపెనీలు పిజ్జా డెలివరీ సమయంలో చెడిపోకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నారు. అందులో భాగంగానే పిజ్జా టూల్ లేదంటే పిజ్జా టేబుల్ ను రూపొందించారు. ఈ పిజ్జా టూల్ ను పిజ్జా సేవర్ అని కూడా అంటారు. వేడికి కార్టన్ బాక్స్ కుంగి పిజ్జా అతుక్కుపోకుండా చూస్తుంది.

1985 నుంచి పిజ్జా డెలివరీ అనేది పిజ్జా టూల్ అమర్చి ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి చాలా వరకు పిజ్జాల విషయంలో ఫిర్యాదులు అనేవి తగ్గాయి. రుచి సహా ఇతర ఫిర్యాదులు ఉన్నా, ఫిజ్జా కార్టన్ బాక్సుకు అత్తుక్కుపోయిందనే ఫిర్యాదులు ఆగిపోయాయి. పిజ్జా డెలివరీ బాయ్స్ తో పాటు కంపెనీలకు కూడా పెద్ద రిలీఫ్ దొరికిందని చెప్పుకోవచ్చు. కొంత మంది ఈ పిజ్జా సేవర్ ను పిజ్జా ను ముక్కలు చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. మరికొంత మంది పిజ్జా తిన్నాక టూత్ పిక్ గా ఉపయోగిస్తున్నారు. అయితే, పిజ్జా టూల్ అసలు ఉద్దేశం మాత్రం పిజ్జాను డెలివరీ బాక్స్ కు అతుక్కోకుండా చూడటమే..ఈ ప్రశ్న మీకు ఎదురైతే సమాధానం చెప్పండి..

Read more RELATED
Recommended to you

Latest news