కచ్చితంగా గెలవాల్సిన సెమీఫైనల్స్ లో టీమిండియా ఘోర పరాభావాన్ని చవిచూసింది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ పోరులో టీమిండియా చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అయితే… T20WC సెమీ ఫైనల్ లో ఓటమి తర్వాత టీమ్ ఇండియాలో కీలక మార్పులకు బీసీసీఐ సిద్ధమవుతోందని తెలుస్తోంది.
ఈ క్రమంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని భారత క్రికెట్ డైరెక్టర్ గా నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. కాగా మూడు ఫార్మాట్లో జట్టు బాధ్యతలను చూడటం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కష్టం అవుతుంది.
ఈ క్రమంలోనే ధోనీకి జట్టు బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ధోని జట్టుతో కలిస్తే ద్రవీడ్ కు పని భారం తగ్గుతుంది. ద్రవిడ్ టెస్ట్, వన్డే ఫార్మాట్ లో ఆటగాళ్లను తీర్చిదిద్దడం పై దృష్టి సారిస్తే, ధోని టి 20 స్పెషలిస్టులను తయారు చేసే పనిలో ఉంటాడు. కాగా వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాత ధోని అన్ని ఫార్మాట్లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.