జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షో లలో మంచి పాపులారించుకున్న కమెడియన్ లలో హైపర్ ఆది, సుడిగాలి సుదీర్ తర్వాత పంచ్ ప్రసాద్ మంచి పాపులారిటీ సంపాదించారని చెప్పవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా జబర్దస్త్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ పలువురు టీమ్ లీడర్స్ తో కలిసి ఎన్నోసార్లు కామెడీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా తన పంచలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ప్రసాద్ కు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ విషయాన్ని ఎప్పుడూ కూడా ప్రసాదు దాచుకోలేదు చాలా సందర్భాలలో ఆ విషయాన్ని బయటపెడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం అంతకంటే పెద్ద సమస్య ఎదురైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే కమెడియన్ పంచ్ ప్రసాద్ ఎప్పుడు ఏ షో లో కనిపించిన సరే ప్రేక్షకులను నవ్వించడమే తన పని అన్నట్టుగా కామెడీ చేస్తూ ఉంటారు. ఎలాంటి వారికైనా సరే తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ ఉంటారు ప్రసాద్. ప్రసాద్ ప్రతివారం డయాలసిస్ చేయించుకుంటున్న సరే తన నొప్పిని ఎక్కడా కూడా తెలియని కుండ కేవలం నలుగురిని నవ్వించాలని ఉద్దేశంతోనే కామెడీ చేస్తూ ఉంటారు.
ఇక పంచ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసే వ్లాగ్ ప్రకారం.. కమెడియన్ జోడి నూకరాజు, ఆసియా గత వారం నుంచి ప్రసాద్ ఇంట్లో ఉంటున్నారు. ఆయనకి సహాయం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఇక పంచ ప్రసాద్ భార్య చెప్పిన దాని ప్రకారం ఒకరోజు షూటింగ్ తర్వాత ఫీవర్ గా ఉందని ఇంటికి వచ్చిన ప్రసాద్.. తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నట్లుగా తెలియజేశారు. అలా నడవలేక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో డాక్టర్ వద్దకు వెళ్లడం జరిగింది. అక్కడ కొన్ని టెస్టులు చేస్తే నడుము వెనకాల వైపు నుంచి కాలి వరకు చీము పట్టినట్లుగా తెలిసిందని సమాచారం. అందుకు సంబంధించి ఒక వీడియోని షూట్ చేసి ఒక వీడియోని పోస్ట్ చేశారు నూకరాజు ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారుతోంది.