ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన పర్యటనలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో ఈనెల 21న సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆక్వా యూనివర్సిటీ, బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్, కాళీపట్నం రెగ్యులేటర్ల నిర్మాణం, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు, సబ్ స్టేషన్ నిర్మాణం వంటి ప్రాజెక్టులను సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం నర్సాపురం బస్టాండ్, వంద పడకల ఆసుపత్రి కి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఏవైనా పెండింగ్ పనులు ఉంటే రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. చిన్న మామిడిపల్లి వద్ద నిర్మించిన హెలిపాడును, 25 వార్డ్ రివర్స్ కాలనీ వద్ద ముఖ్యమంత్రి బహిరంగ సభ వేదికను పరిశీలించారు. వేదిక పనులు వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. బహిరంగ సభ వద్ద పార్కింగ్ విషయంలో ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.