కొంతమందిని చూస్తే మనకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా జీవితంలో పైకి రాగలము. 21 ఏళ్లు వయసు అతను 60 రోజుల్లోనే 80 వేల రూపాయలని సంపాదించాడు. అది కూడా మష్రూమ్ ఫార్మింగ్ ద్వారానే మట్టి లేకుండా పుట్టగొడుగులని పెంచి చక్కగా డబ్బులు సంపాదిస్తున్నాడు. చాలామంది డబ్బులు సంపాదించడం కోసం వివిధ మార్గాలని ఎంచుకుంటూ ఉంటారు.
మీరు కూడా మంచి ఐడియా కోసం చూస్తున్నట్లయితే ఈ వ్యక్తిని ఆదర్శంగా తీసుకోండి. నిజంగా ఈ వ్యక్తి స్ఫూర్తిదాయకం. ఇంత చిన్న వయసులో అంత ఎక్కువ డబ్బులని తక్కువ సమయంలో సంపాదించడం అనేది గొప్ప విషయం. 625 స్క్వేర్ ఫీట్ల ప్లాట్ తీసుకుని వెదురు ఆకుపచ్చని నెట్లు బ్లాక్ పాలిథిన్ ఉపయోగించి మష్రూమ్స్ ని నాటాడు ఇది తయారవ్వడానికి నెల రోజులు సమయం పట్టింది. స్ట్రక్చర్ అంతటిని పూర్తిచేసిన తర్వాత పది రోజుల పాటు 500 బ్యాగుల పుట్టగొడుగులని ప్రిపేర్ చేశాడు. ఒక బ్యాచ్ మష్రూమ్లకి 45 నుండి 60 రోజుల పడుతుంది.
ఒక నెలరోజుల పాటు కోర్సు తీసుకుని దీనిని మొదలుపెట్టాడు. 80 కేజీలని మష్రూమ్లని పెంచాడు. ఒక కేజీ ధర 100 రూపాయలుగా ఉంది. ఓస్టెర్ మష్రూమ్స్ ని 100 నుంచి 150 రూపాయల వరకు కిలో అమ్మొచ్చు. చక్కగా పుట్టగొడుగుల పెంపకం ద్వారా డబ్బులని సంపాదిస్తున్నాడు ఇతను. ఏదైనా చేయాలనుకుని చేయలేకపోతున్న వాళ్ళు ఇతనిని ఆదర్శంగా తీసుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళచ్చు మంచిగా సంపాదించుకోవచ్చు.