కేసీఆర్ మాస్టర్ ప్లాన్..తెలంగాణలో భారీగా కలెక్టర్ల బదిలీలు

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారు. తెలంగాణలో భారీగా కలెక్టర్లను బదిలీలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే, తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు కానున్నాయి. ఈ మేరకు కసరత్తు పూర్తి చేశారు సీఎం కెసిఆర్.

ఐఏఎస్ ల బదిలీలపై ఏ క్షణం ఐనా అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే ఛాన్స్‌ ఉంది. చాలా కాలం తర్వాత ఐఏఎస్ ల బదిలీలకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనుకోవాలి. నాలుగేళ్లుగా ఒకే పోస్టులో కొందరు ఐఏఎస్ లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. మెజారిటీ జిల్లా కలెక్టర్లను బదిలీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఎన్నికలకు ఏడాది ముందు కెసిఆర్ పాలన ప్రక్షాళన చేస్తున్నారు. ఇక బదిలీల తర్వాత కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news