ఆ సీక్రెట్ నిజం అయితే ఆ సినిమా పని గోవిందా..!!

-

ఒకప్పుడు తెలుగు లో ఎక్కువగా యాక్షన్ సినిమాలు ఎక్కువుగా అలరించేవి. ఇక ఈ ఓటిటి ల కాలంలో అందరూ త్రిల్లర్స్ వెంట పడుతున్నారు. ఓటిటి విడుదల లను చూస్తే దాదాపు సగం పైనే త్రిల్లర్స్ సినిమాలు వెబ్ సీరీస్ లు ఉన్నాయి.ఇక థియేటర్స్ లో కూడా వీటి హవా నడుస్తోంది. ఇప్పుడు తెలుగు లో త్రిల్లర్ సినిమా  ‘హిట్ 2’ఈ వారం విడుదల కాబోతుంది.

వరస హిట్స్ తో మంచి జోష్ లో ఉన్న అడివి శేష్ ఈ మూవీలో హీరోగా నటించాడు. నేచురల్ స్టార్ నాని నిర్మాత గా వ్యవరిస్తున్నాడు.ఈ థ్రిల్లర్ సినిమా కు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.  మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.టీజర్ ట్రైలర్లు విడుదల అయ్యి ఆకట్టుకున్నాయి.

ఇక హిట్ 1 లాగే మర్డర్ చేసే  ఓ సైకో కిల్లర్ కథగా వస్తోంది. అయితే ఇలాంటి సినిమా లలో చివర వరకు మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది చూపించకుండా సీక్రెట్ గా ఉంచుతారు. ఇది చూసే వారిలో కుతూహులం కలిగేలా చేస్తుంది.కాని ఒక పర్సన్  సోషల్ మీడియాలో ఈ మూవీలో హీరోయిన్ నే సైకో కిల్లర్ అంటూ వైరల్ చేస్తున్నాడు. దానికి అతను మా ఫ్రెండ్ ఆ సినిమాలో నటించాడు ఇది నిజం అని కూడా బల్ల గుద్ది చెబుతున్నాడు. ఇది నిజం అయితే ఈ విషయం సినిమా పై ప్రభావం చూపే అవకాశం ఉంది

Read more RELATED
Recommended to you

Latest news