వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ట్వీట్ వార్ ముదురుతోంది. కల్వకుంట్ల కవిత వైయస్ షర్మిలను బిజెపి వదిలిన బాణం అని, ఆమె తనా అంటే తామర పువ్వులు తందానా అంటున్నారని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా వైయస్ షర్మిల ట్వీట్ చేస్తూ..
“పాదయాత్రలు చేసింది లేదు. ప్రజల సమస్యలు చూసింది లేదు.. ఇచ్చిన హామీల అమలు లేదు.. పదవులే కానీ పనితనం లేని గులాబీ తోటలో ” కవిత”లకు కొదవలేదు ” అని కౌంటర్ ఇచ్చారు. ఇక మరోసారి షర్మిల చేసిన ట్వీట్ కి కల్వకుంట్ల కవిత మరో కౌంటర్ ని సందించారు.
“అమ్మ.. కమల బాణం. ఇది మా తెలంగాణం. పాలేవో, నీళ్లేవో తెలిసిన చైతన్య ప్రజాగణం. మీకు నిన్నటి దాకా పులివెందులలో ఓటు, నేడు తెలంగాణ రూటు, మీరు కమలం కోవర్టు.. ఆరెంజ్ ప్యారేట్టు. మీలాగా పొలిటికల్ టూరిస్ట్ కాను నేను. ఉద్యమంలో నుంచి పుట్టిన మట్టి కవితను నేను ” అని కౌంటర్ ఇచ్చారు. మరి ఈ ట్వీట్ వార్ ఇంకెంత దూరం వెళుతుందో వేచి చూడాలి.