హీరోయిన్ గా మారిన మరో చైల్డ్ ఆర్టిస్ట్.. టీజర్ అదర్స్..!

-

బాలీవుడ్ ని మొదలుకొని టాలీవుడ్ వరకు ఇప్పటికే చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలా చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరో హీరోయిన్లుగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలనటిగా నటించి మెప్పించిన అనిఖా సురేంద్రన్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. 2007లో బాలనటిగా వెండితెరకు పరిచయమైన ఈ చిన్నారి చిచ్చరపిడుగు కేరళ కుట్టి.. అక్కడే ఎక్కువ సినిమాలలో నటించింది. అలా మలయాళం, తమిళ్ , తెలుగు భాషల్లో నటించి బాలనటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నారి ..ఇప్పుడు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా బిజీగా మారింది. నిత్యం తన లేటెస్ట్ ఫోటోషూట్లతో ఆకట్టుకునే ఈ చిన్నారి తాజాగా నాగార్జున హీరోగా నటించిన ది గోస్ట్ సినిమాలో కీలకపాత్ర పోషించింది.

Anikha Surendran - Wikipedia

ఇకపోతే ఇప్పుడు అనిఖా హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కుతోంది. మలయాళం తో పాటు తెలుగులో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేసింది. అనిఖా తెలుగులో నటిస్తున్న చిత్రం “బుట్ట బొమ్మ”.. శౌరీ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్ హీరోగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో అనిఖా చాలా న్యాచురల్ గా.. ఎంతో అద్భుతంగా తన నటనను కనబరిచింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటివరకు బాలనటిగా మెప్పించిన అనిఖా హీరోయిన్గా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి . ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణం సారథ్యంలో వస్తున్న ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా మలయాళం కెప్పేల మూవీ నుంచి రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రీమేక్ సినిమాతో హీరోయిన్గా మారనున్న ఈ చిన్నారి తన నటనతో ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఇకపోతే సోషల్ మీడియాలో నిత్యం గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీని దక్కించుకుంది అనిఖా.

Read more RELATED
Recommended to you

Latest news