బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. మిషన్ భగీరథ ద్వారా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు నీరు అందిస్తామని కీలక ప్రకటన చేశారు. క్యాంపస్ విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నందున మొత్తం సోలార్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
రూ.5 కోట్లతో సైన్స్ క్లబ్ ఏర్పాటు చేస్తామని.. క్యాంపస్ లోని చెరువును సుందరీకరణ చేస్తామని స్పష్టం చేశారు కేటీఆర్. వెంటపడి పనులు పూర్తి చేయించే బాధ్యత నాది, మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పారు కేటీఆర్. 10 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రపంచంతో పోటీపడే సత్తా మీకు ఉంది, ఇంకా శానిటేషన్ సిబ్బంది కి యంత్రాలు మంజూరు చేస్తాం, నాణ్యమైన భోజనం అందిస్తామని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.