ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమిళ నాడు లో సినిమా థియేటర్స్ కోసం అడుక్కునే పరిస్తితిలో ఉన్నాడట. దిల్ రాజు స్టార్ హీరో దళపతి విజయ్ డేట్స్ సంపాదించి , మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని తో తమిళ్ లో వారీసు గా తెలుగు లో వారసుడుగా అత్యంత భారీ స్థాయిలో సినిమా నిర్మిస్తున్నారు.హీరో విజయ్ కి వున్న రెండు రాష్ట్రాల్లో వున్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తెలుగు తమిళ భాషల్లో సంక్రాంతికి కానుక గా జనవరి 12న విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ డేట్ ని ప్రకటించేసింది.
వారసుడు కోసం దిల్ రాజు రూ.250 కోట్ల వరకు పెట్టారట .సంక్రాంతికి రాబోతున్న సినిమాల బడ్జెట్ పరంగా చూసుకుంటే తమిళంలో లో హీరో అజిత్ వలిమై సినిమా వల్ల తన సినిమా నష్ట పోయే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే అక్కడ అజిత్ కూడా ఫాలోయింగ్ ఉంది అలాగే ఆ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసేది కూడా గవర్నమెంట్ నుండి ఫుల్ సపోర్ట్ ఉన్న వారట.
ఇక ఒక ఇంటర్వ్యూ లో దిల్ రాజు తన గోడు వెళ్లబోసుకున్నారు.. ప్రస్తుతం తమిళనాడులో 800 థియేటర్స్ ఉన్నాయి. విజయ్ అక్కడ అందరికంటే పెద్ద స్టార్. అక్కడ ఆయనకు పెద్ద మార్కెట్ వుంది.కాని అదే టైమ్ లో అజిత్ మూవీ కూడా విడుదల అవుతుంది. నాకు 400 థియేటర్స్ ఇస్తున్నారు. నా సినిమా హీరో విజయ్ పెద్ద స్టార్ కాబట్టి కనీసం మరో 50 థియేటర్స్ ఇవ్వమని అడుక్కుంటున్నాను అని సంచలన కామెంట్స్ చేశారు.