రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి లో యువతి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఇవాళ తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో తండ్రి చంద్రయ్య తో కలిసి శాలిని (18) అనే యువతి హనుమన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
అప్పటికే కారులో కాపు కాసిన నలుగురు యువకులు…తండ్రిని కొట్టి బలవంతంగా యువతిని లాక్కెళ్లారు. ఇక యువతిని బలవంతంగా లాక్కెల్లి కారులో తోసి వేసే విజువల్స్ సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఇటీవల ఈ మైనర్ యువతిని అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో వేదింపులు చేశాడు. దీంతో అతనిపై ఫోక్స్ కేసులో జైలు పంపారు. అయితే, ఆ యువకుడు రెండు రోజుల కిందట జైలు నుంచి బయటకు వచ్చాడు. దీంతో ఆ యువకుడి పైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.