ఏటీఎం లో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి.. డబ్బులు కట్ అయితే ఏం చెయ్యాలి..?

-

ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఆన్ లైన్ పేమెంట్స్ ని చేస్తున్నాం. అలానే క్యాష్ పేమెంట్స్ చెయ్యడం కోసం ఏటీఎం మెషిన్ల ద్వారా డ్రా చేసుకోవచ్చు. క్షణాల్లో మనం క్యాష్ ని ఏటీఎం మెషిన్ల ద్వారా డ్రా చేసుకోవచ్చు.

కానీ అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా డబ్బులు అకౌంట్‌ నుండి కట్ అయి కూడా బయటికి రాకపోవడం… అలానే కార్డు స్ట్రక్ అవడం, నెట్‌వర్క్ సమస్య వంటివి కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి.. మీ అకౌంట్‌ నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయా….? కానీ ఇలా కనుక జరిగితే ఏమి టెన్షన్ పడక్కర్లేదు. బ్యాంకులో ఫిర్యాదు చేసి మీరు ఆ సమస్యని పరిష్కరించుకోవచ్చు. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా టైం లో కూడా అమౌంట్ కట్ అయితే మీరు సంబంధిత బ్యాంకు లో కంప్లైంట్ చెయ్యచ్చు.

లేదంటే మీరు కస్టమర్ కేర్ నంబర్‌కు ఫిర్యాదు చెయ్యచ్చు. కార్డ్ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినా కొన్ని సార్లు మనీ మిషన్ లో స్ట్రక్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతుంది. ఇలా జరిగితే బ్యాంకులు కొద్ది రోజుల్లోనే ఆ అమౌంట్ ని రిఫండ్ చేస్తాయి. ఒకవేళ కనుక టైం లో వీటిని రిఫండ్ చెయ్యకపోతే బ్యాంకులు రోజుకు రూ.100 చొప్పున పరిహారం చెల్లించాల్సి వుంది. https://cms.rbi.org.in వెబ్‌సైట్‌కు వెళ్లి మీరు కంప్లైంట్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news