వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో 7 గిడ్డంగుల నిర్మాణానికి కేంద్ర వేర్ హౌస్ కార్పొరేషన్ ప్రణాళిక రూపొందించిందని కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వెల్లడించారు.
మొత్తం 1,81,262 మెట్రిక్ టన్నుల సామర్థ్యం తో కడప, నంద్యాల, రేణిగుంట, సత్తెనపల్లి, నెల్లూరు, నందికట్కూరు, వడ్లమూడిలో వీటిని నిర్మించనున్నట్లు పార్లమెంటులో వెల్లడించారు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. పాఠశాల భవనాల మర మత్తులు మరియు ఇతర మౌలిక వసతుల కల్పనకు సమగ్ర శిక్ష అభియాన్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీ నాటికి ఏకంగా 867 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది.