హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రి వైద్యులను అభినందించారు రాష్ట్ర ఐటీ, పురపాలక సంఘం మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. 24 గంటలలో నాలుగు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన నిమ్స్ వైద్య బృందాన్ని అభినందించారు. ” వాట్ ఏ బ్యూటిఫుల్ న్యూస్ హైదరాబాద్లోని నిమ్స్ వైద్యులు 24 గంటలలో నాలుగు కిడ్నీలు మార్పిడి చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు రోగులకు అద్భుతమైన సేవలను అందిస్తున్నాయి. సిబ్బంది అందరికీ నా అభినందనలు ” అని ట్వీట్ చేశారు.
దాదాపు 18 మంది వైద్యులు, సిబ్బంది 24 గంటలకు పైగా శ్రమించి క్లిష్ట శాస్త్ర చికిత్సలు పూర్తి చేశారు. ఈ నాలుగు శస్త్ర చికిత్సలు ఈనెల 19వ తేదీన రాత్రి ప్రారంభమై.. బుధవారం తెల్లవారుజాము వరకు సాగాయి. 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు అయ్యే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సలను ఆరోగ్య శ్రీ పథకం కింద పేద రోగులకు ఉచితంగా నిర్వహించారు.
What a beautiful news 👍
Doctors at NIMS, Hyderabad have performed 4 kidney transplantations within 24 hours
Telangana Govt hospitals have been delivering terrific valued services to the patients. My compliments to all the staff pic.twitter.com/UF0tIKXPAz
— KTR (@KTRTRS) December 22, 2022